ఈ టోకెన్ ఉంటేనే రూ. 500 కి గ్యాస్ సిలిండర్ ఇస్తారు

Categories:


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీలను నెరవేర్చే దిశగా దూసుకెళుతున్నారు.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు.
ఇప్పుడు 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకం పై ఒక టోకెన్ విడుదల చేసింది. ఈ టోకెన్ ఉన్నవారికి మాత్రమే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. అదేవిధంగా చేయూత పథకం కింద రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షల కు పెంచింది రేవంత రెడ్డి సర్కార్. కాగా మిగిలిన హామీలను కూడా వీలైనంత త్వరగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.
అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన 500 కే గ్యాస్ సిలిండర్ హామీని కూడా త్వరలోనే ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికోసం ఇప్పటినుండే మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే అసలు పథకం ప్రారంభించక ముందే మహిళలు ఏజెన్సీల ముందు క్యూ కట్టడం ఏంటి అనుకుంటే ఈ పథకం కోసం ఈ కేవైసీ చేయించుకోవాల్సిందిగా వార్తలు వచ్చాయి. ఈ కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రాదని వార్తలు రావడంతో మహిళలంతా తమ ఆధార్ కార్డులను పట్టుకొని గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. అసలు విషయానికి వస్తే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తాజాగా ఈ కేవైసీ మహిళలంతా వెంటనే చేసుకోవాల్సిందిగా ప్రకటించారు.
ఈ ప్రకటనకు 500 కి గ్యాస్ సిలిండర్ పథకానికి లింక్ ఉందని వార్తలు ప్రచారం కావడంతో మహిళలంతా ఈ కేవైసీ చేయించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే వాస్తవానికి కేంద్రం ప్రకటించిన ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదట. ఇక ఈ విషయాన్ని స్వయంగా గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. అయితే కేంద్రం ఈ కేవైసీ పూర్తికాని వారిని మాత్రమే చేసుకోమని ప్రకటించడం జరిగింది. అది కేవలం కేవైసీ పూర్తికాని వారికి మాత్రమే అని తెలియజేసింది. కావున కేవైసీ పూర్తి చేసుకున్న వారు మళ్లీ ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ లకి వెళ్లాల్సిన అవసరం లేదని తెలియజేశారు. కావున తెలంగాణలోని గ్యాస్ లబ్ధిదారులంతా ఈ విషయాన్ని అవగాహనలో పెట్టుకొని గ్యాస్ ఏజెన్సీ వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *