Bigg Boss 7 Telugu లో ఇప్పటికే తొమ్మిదివారాలు ముగిసిపోయాయి. ఇక పదో వారంకూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా చాలానే ఎపిసోడ్లు ఉండగానే పదో వారంలో ఫ్యామిలీ విజిటింగ్ ను కూడా పెట్టేశాడు బిగ్ బాస్.
ఇందులో అందరూ ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా. ఈ సారి పదో వారం నామినేషన్స్ లో పెద్ద రచ్చ ఏమీ జరగలేదు. అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు కూడా పెద్దగా లేవు. కానీ సింపుల్ గా జరిగిపోయాయి. రాజమాతలుగా వ్యవహరించిన ప్రియాంక, శోభాశెట్టి, రతికా, అశ్వినీలు ఉండగా. వారే హౌస్ మేట్స్ ను నామినేట్ చేసే బాధ్యతను తీసుకున్నారని చెప్పుకోవాలి.
ఇక పదో వారం నామినేషన్స్ లో మొత్తంగా ఐదుగురు మంది ఉన్నారు. ఇందులో చూసుకుంటే పదో వారం నామినేషన్లలో సింగర్ భోలే, గౌతమ్ కృష్ణ, హీరో శివాజీ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ ఉన్నారు. అయితే ఈ ఐదుగురికి సోమవారం నుంచే ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. వాస్తవానికి నామినేషన్స్ ఈ నడుమ రెండు రోజులు జరుగుతున్నాయి. కానీ పదో వారం మాత్రం పెద్దగా గొడవలు లేకపోవడంతో ఒకేరోజు ముగించేశారు. ఇక ఈ పదో వారం ఓటింగ్ లెక్కలు షాకింగ్‌గా ఉన్నాయి. అందరూ ఊహించినట్టే హీరో శివాజీ అందరికంటే టాప్ పొజీషన్ లో ఉన్నాడు.
ఈసారి 37.78 శాతం ఓటింగ్‌తో శివాజీ మొదటి స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి ఇప్పటి వరకు నిర్వహించిన ప్రతి నామినేషన్ లో కూడా ఓటింగ్ లో శివాజీ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే ఈ సారి రెండో స్థానంలోకి అనూహ్యంగా రతిక రోజ్ వచ్చింది. హౌస్ లో చెత్త కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న రతికరోజ్ కు 16.5 శాతం ఓట్లతో లీడింగ్‌లో ఉంది. అయితే ఆమెకు పల్లవి ప్రశాంత్ మద్దతు దారులు ఓట్లేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. అతనికి ఈ సారి 15.43 శాతంతో పర్వాలేదనిపిస్తున్నాడు.
Bigg Boss 7 : పదో వారంలో షాకింగ్ ఓటింగ్. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్. ఎవరు ఎలిమినేట్ ?
Categories: