బిగ్ బాస్ కెప్టెన్‌గా గౌతమ్.మరోసారి కింగ్ మేకర్‌గా శివాజీ. కెప్టెన్‌ని డిసైడ్ చేసిన శివన్న ఓటు ?

Categories:

గత రెండు వారాలుగా గౌతమ్. శివాజీని టార్గెట్ చేస్తూ. దూషిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు అదే గౌతమ్‌ని కెప్టెన్‌ని చేస్తున్నారు శివాజీ. కెప్టెన్‌గా. సందీప్, గౌతమ్‌ ఇద్దరూ ఫైనల్ రేస్‌లో ఉండగా.తన ఓటుతో గౌతమ్‌ని కెప్టెన్ చేసి మరోసారి కింగ్ మేకర్ అనిపించాడు శివాజీ. పల్లవి ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్‌ని చేసిన చేతితోనే గౌతమ్‌ని కూడా కెప్టెన్‌ని చేశారు శివాజీ. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్. తొలిరౌండ్‌ నుంచి ప్రతిభ చూపిస్తూ వచ్చాడు. నిజానికి ఇప్పుడు కాదు.గౌతమ్ ఎప్పుడో కెప్టెన్ కావాల్సింది. కానీ లక్ కలిసిరాక.చివరి క్షణంలో ఛాన్స్ మిస్ అయ్యేది. కానీ ఈ 8వ వారంలో శివాజీ కరుణించడంతో మనోడికి లక్ కలిసి వచ్చింది. అయితే ఇప్పటి వరకూ శివాజీ-గౌతమ్‌లు ఉప్పు నిప్పుగా ఉన్నారు. తనకి ఈవారం కెప్టెన్‌ని చేయడంతో. గౌతమ్కూడా. శివన్న గ్రూప్‌లో సభ్యుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నట్టు గౌతమ్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నాడు. వచ్చే వారం కెప్టెన్‌గా హౌస్‌లో ఉండాలంటే. ఈవారం సేవ్ కావాలి డాక్టర్ గౌతమ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *