2014లో ఉదయ్ కిరణ్ అకస్మాత్తుగా ఉరివేసుకొని కన్నుమూశారు. అతడు మరణించి ఎనిమిదేళ్లు అవుతున్న ఇప్పటికే ఆయన గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణానికి చిరంజీవి కారణం అని చాలామంది ఆరోపిస్తున్నారు.
ఉదయ్ కిరణ్ కి సినిమా ఆఫర్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ ఆ కుట్ర వెనుక చిరంజీవి లేడు. చిరంజీవి అందరిని ప్రోత్సహిస్తారు. ఇండస్ట్రీలో నానికి ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఇప్పుడు నాని వరుసగా సినిమాలు చేస్తున్నారు.అలాంటిది ఆయన ఉదయ్ కిరణ్ కి ఆఫర్లు తగ్గించే అవకాశం ఉండదు. అయితే తన కూతురు సుస్మిత ఉదయ్ కిరణ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ తమ స్థాయికి ఉదయ్ కిరణ్ సరిపోడని చిరంజీవి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. అంతే తప్ప చిరంజీవి ఉదయ్ కిరణ్ మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు.
ఇక చిరంజీవి తన కూతురు సుస్మిత ను తమ స్థాయికి తగ్గట్టు వేరొకరిని ఇచ్చి గ్రాండ్ గా వివాహం చేశారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ లవ్ ఫెయిల్ అవ్వడం, అలాగే సినిమా ఆఫర్లు తగ్గడంతో మానసికంగా బాగా కృంగిపోయారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు స్వాతి అనే సాఫ్ట్వేర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన ఉదయ్ కిరణ్ తర్వాత ఆఫర్లు తగ్గుకుంటూ వచ్చాయి. ఈ మనస్థాపంతోనే అతను 2014లో ఉరివేసుకొని మృతి చెందారు. కానీ అభిమానులు ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ను తలచుకుంటూ ఉంటారు.