పవన్ కల్యాణ్ సూపర్‌స్టార్ అని, అందులో ఎలాంటి సందేహం లేదని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయం సాధిస్తారా?’ అనే ప్రశ్న ఎదురవ్వగా ”నేనేమైనా బ్రహ్మంగారినా విజయం సాధిస్తారో, లేదో చెప్పడానికి” అని అన్నారు.
సినిమాల పరంగా ఆయన గురించి అడగండి చెబుతూనంటూ పవన్ కల్యాణ్‌ను కొనియాడారు. ఆయన పవరేంటో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఆయన నటించిన ఒక సినిమా ఆడకపోయినా తదుపరి చిత్రానికి రెట్టింపు కలెక్షన్స్ వస్తాయని, అది స్టార్ పవర్ అని అన్నారు.
పవన్ కింగ్ అవుతారా? కింగ్‌మేకర్ అవుతారా?’ అనే దానిపై స్పందిస్తూ.. దీనికి కొన్ని నెలల తర్వాత సమాధానం చెప్పగలనని, ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా తదుపరి చిత్రంపైనే ఉందని తెలిపారు. ”ప్రజలు చాలా స్మార్ట్. సినిమా చూస్తారు. ఎవరు నచ్చితే వారికి ఓటు వేస్తారు. పాలిటిక్స్‌లో మహానుభావులు ఓడిపోయి ఉన్నారు. నా జీవితం, గ్రామం, దేశాన్ని బాగుచేయగలరని నమ్మిన వారికి ప్రజలు ఓటేస్తారు. వాళ్లకు క్లారిటీ ఉంది” అని వివరించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కొత్త సినిమా గురించి మాట్లాడుతూ.
భారీ బడ్జెట్‌తో ‘భక్త కన్నప్ప’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించనున్నామని, అది సెప్టెంబరులో ప్రారంభమవుతుందన్నారు. ఈ సినిమాలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలిపారు. తాము ఓ రియాలిటీ షో చేస్తున్నానమని, చాలా ప్రశ్నలకు అందులో సమాధానాలు లభిస్తాయని చెప్పారు.