ఆ యంగ్ హీరోతో అర్జున్ కూతురి పెళ్లి
హీరోఅర్జున్ సార్జా అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన తెలుగు సినిమా ల్లో ఎక్కువగా కనిపించడం లేదు కానీ గతంలో అయితే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈయన తన అద్భుతమైన యాక్టింగ్ తో నటించి మెప్పించారు.అలాంటి అర్జున్ సార్జా ఈమధ్య తన కూతురు ఐశ్వర్యను కూడా సినిమాల్లోకి పరిచయం చేశారు.ఇక ఆ మధ్య కాలంలో విశ్వక్ సేన్ హీరోగా తన కూతుర్ని హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా మొదలుపెట్టారు.ఇక ఈ విషయం ఇలా ఉంటే ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక వార్త నెట్ లో హల్చల్ చేస్తుంది.మరి ఇంతకీ ఐశ్వర్య పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకోలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన ఒక యంగ్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక అసలు విషయం ఏంటంటే
ఒక యంగ్ హీరో తో ఐశ్వర్య రిలేషన్ లో ఉండటం బయటపడడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుంది అన్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈమె హీరోయిన్ గా విశ్వక్ సేన్హీరో గా అర్జున్ డైరెక్షన్ లో ఒక సినిమా రావాల్సి ఉండగా విశ్వక్ సేన్ కి అర్జున్ కి మధ్య విబేధాలు రావడం తో ఆ సినిమా ఆగిపోయింది. అందుకే ఇక ఆమె పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయినట్టు గా తెలుస్తుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ వేరే సినిమాలు చేస్తున్నాడు అయితే ఈమె పెళ్లి విషయం లో ఎంతవరకు నిజం ఉంది అన్నది వాళ్లు బయట పెడితే కానీ తెలియదు.అలాగే ఐశ్వర్య ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు.
ఆ యంగ్ హీరోతో అర్జున్ కూతురి పెళ్లి