మెడియన్ బేత సుధాకర్.. ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ, ఓ ఇరవై ఏళ్ల క్రితం తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూసినవాళ్లకు పరిచయం అక్కర్లేదు.అబ్బబ్బా.’అంటూ తనదైన పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గొప్ప కమెడియన్ ఆయన. తమిళ్‌లో హీరోగా పలు సినిమాల్లో నటించిన సుధాకర్. తెలుగులో మాత్రం కమెడియన్‌గా సెటిల్ అయిపోయాడు. 2000 సంవత్సరం వరకు బిజియెస్ట్ ఆర్టిస్ట్‌గా కొనసాగాడు. ఇక సంక్రాంతి(2005) తర్వాత సుధాకర్ తెలుగు సినిమాల్లో నటించలేదు. అనారోగ్యం కారణంగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.
ఆయన వారసుడు బెనెడిక్ మైఖేల్ ఇండస్ట్రీలోకి రావాలని ట్రై చేస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. త్వరలోనే తన వారసుడు టాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నట్లు సుధాకర్ తెలిపాడు. తాజాగా ఓ టీవీ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వెళ్లిన సుధాకర్. తన వారసుడి ఇండస్ట్రీ ఎంట్రీ చిరంజీవి చేతుల మీదుగా జరుగుతుందని వెల్లడించాడు.
మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ బెస్ట్ ఫ్రెండ్స్. చెన్నైలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండేవారు. చిరంజీవి కంటే ముందు సుధాకరే హీరోగా మారి, సినిమాలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత చిరంజీవికి సినిమా అవకాశాలు రావడం. వరుస సూపర్ హిట్లతో మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక సుధాకర్ మాత్రం తెలుగులో కమెడియన్‌గా సెటిల్ అయ్యాడు. తన స్నేహితుడు చిరంజీవి హీరోగా నటించిన పలు సినిమాల్లో సుధాకర్ కమెడియన్‌గా నటించాడు.చిరంజీవితో ‘యముడికి మొగుడు’ సినిమాలో కలిసి నటించడమే కాకుండా. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా పాలు పంచుకున్నారుసుధాకర్ చిరంజీవి మంచి స్నేహితులే కావడంతో. వీళ్ల మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే తన కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ బాధ్యతను చిరంజీవి తీసుకున్నాడు. ‘చిరంజీవి నా మిత్రుడు.శ్రేయోభిలాభి. మా అబ్బాయి గురించి అప్పుడే చెప్పకూడదు కానీ.చిరంజీవి గారే చేసి చూపిస్తారు’ అంటూ తన కొడుకు ఎంట్రీ గురించి సుధాకర్ చెప్పుకొచ్చాడు. గతంలో తన కొడుకు కాలేజీ సీటు విషయంలో కూడా చిరంజీవి సహాయం చేశాడని సుధాకర్ చెప్పారు. మొత్తానికి తన స్నేహితుడి కొడుకు కెరీర్‌ని తీర్చిదిద్దే బాధ్యత చిరంజీవి తీసుకున్నాడన్నమాట. ‘మెగా’ ఆశిస్సులతో ప్రారంభమయ్యే సుధాకర్ కొడుకు సినీ కెరీర్ బాగుండాలి కోరుకుందాం.