ఇక్కడ రూ. 2 వేల నోట్లు తీసుకోబడవు. బోర్డు పెట్టిన వైన్ షాపు నిర్వాహకులు !

| | 0 Comments| 10:48 pm
Categories:

రెండు వేల రూపాయల నోట్లను షాపులు, దుకాణదారులు ఖచ్చితంగా తీసుకోవాలని ఆర్బీఐ చెబుతోంది. వాటిని తిరస్కరించేందుకు వారికి అధికారం లేదని అంటోంది.కానీ పలు చోట్ల దుకాణ దారులు, వ్యాపారస్తులు రెండు వేల రూపాయల నోట్లను తీసుకోవడం లేదు.

తాజాగా రెండు వేల రూపాయల నోట్లు తీసుకోబోమంటూ మక్తల్ పట్టణంలో ఓ వైన్ షాపు నిర్వాహకులు ఏకంగా బోర్డు పెట్టారు. పెద్ద నోట్లు పట్టుకు వస్తే మందు ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. దీంతో మందు బాబులు ఇబ్బందులు పడుతున్నారు. నోట్లు మార్చుకునేందుకు సమయం ఉన్నా వైన్ షాపు నిర్వహకులు ఇలా చేస్తుండటంపై మందు బాబులు మండిపడుతున్నారు.

ఇక ఈ విషయంపై షాపు నిర్వాహకులను నిలదీసిన మందు ప్రియులను వాళ్లు బెదిరించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధి ఒకరు వైన్ షాపు దగ్గరకు వెళ్లారు. ఈ విషయంపై షాపు నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేయగా సదరు మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కానీ అటు పోలీసులకు, ఇటు వైన్ షాప్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏదో ఒకసాకు చెబుతూ తప్పించుకుంటున్నారని మందుబాబులు వాపోతున్నారు. ఈ విషయమై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *