రవిబాబు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే పూర్ణ పేరే వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి.
ఇప్పుడు నాలుగో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైతే. ఇప్పుడు ఐదో సినిమా ఓటీటీలో వస్తోంది. తొలి చిత్రాలకు ఆయన దర్శకుడు అయితే.
కొత్త సినిమాకు ఆయన నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ. ఏదేమైనా ఆయన సినిమా అంటే ఆమె పక్కా అనేలా మారింది. దీనిపై రవిబాబు దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
”పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంది” అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన కామెంట్ చేశారు. అయితే ఆయన చెప్పిన పూర్తి విషయం ఇలా ఉంది. ”ఆమెతో నాకు లవ్ అఫైర్ ఉంది.అలా అన్నానని ఇంకేదో అనుకునేరు. ప్రతి దర్శకుడికీ తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుంది” అని చెప్పుకొచ్చారు రవిబాబు. దర్శకుడు చెప్పిన దాని కంటే నటులు 10 – 20 శాతం యాడ్ చేసి నటిస్తుంటారు.
కానీ పూర్ణ 200 శాతం యాడ్ చేస్తుంది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.నా సినిమాల్లో కథానాయిక పాత్ర అనేసరికి ఠక్కున పూర్ణ గుర్తొస్తుంది. అయితే ఆమె కొన్ని సినిమాలు చేస్తుంది, కొన్నింటికి నో చెబుతుంది. మొన్నీ మధ్య నా కొత్త సినిమా ‘వాషింగ్ మెషిన్’ కోసం పూర్ణను అడిగాను. ఆమె నిర్మొహమాటంగా ‘నేను చేయను’ అని చెప్పేసింది.
ఆమె ఓ పాత్రకి నేను కరెక్ట్ అనుకుంటేనే నటిస్తుంది. లేదంటే నో చెప్పేస్తుంది. అలా కాకుండా నా కోసం ఒప్పుకోదు. అలా ఒప్పుకోకూడదు కూడా. అందుకే ఆమె కోసమే అనుకునే ఐదు సినిమాల్లో పూర్ణ నటించింది అని రవిబాబు చెప్పుకొచ్చారు.