టాప్ నిర్మాతతో పెళ్లి. కత్రినా, కియారా తర్వాత లైన్‌లో రకుల్ ప్రీత్ సింగ్

| | 0 Comments| 11:52 pm
Categories:

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్.ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కే పరిమితమైంది. హిందీ సినిమా పరిశ్రమలోనే విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నది. చేతినిండా బాలీవుడ్ చిత్రాలతో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పరంగా మరో జోన్‌లోకి ప్రవేశించింది.


బాలీవుడ్ నిర్మాతతో డేటింగ్ అంటూ


అయితే బాలీవుడ్‌లో అగ్రనిర్మాతల్లో ఒకరైన జాకీ భగ్నానీతో ప్రేమలో పడిందనే వార్తలు ఆ మధ్య జోరుగా షికారు చేశాయి. అంతలోనే డ్రగ్స్ కేసు వెంటాడటంతో ఆ వార్తలకు కొద్దికాలంగా బ్రేక్ పడినప్పటికీ.ఆ తర్వాత జాకీతో ప్రేమ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.


నీవు నా ప్రపంచం అంటూ రకుల్


తమ రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు రకుల్ ప్రీత్ సింగ్ చెక్ చెబుతూ. తన అఫైర్, డేటింగ్ విషయాన్ని అఫీషియల్‌గా బయటపెట్టింది. నీవు నా పక్కన లేకుండా.. రోజు అనే దానికి అర్ధం ఉండదు. నీవు లేకపోతే ఎంత రుచికరమైన ఆహారమైనా రుచించదు. నాకు ఓ ప్రపంచంగా మారిన మంచి సోల్‌మెట్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దాంతో జాకీ భగ్నానీతో బంధానికి అధికారికంగా ముద్ర పడింది.

పెళ్లికి సిద్దమవుతున్న ప్రేమపక్షులు.


అయితే బాలీవుడ్‌లో యువ సినీ తారలందరూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకొంటున్న తరుణంలో రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలోనే ఈ ఇద్దరు ప్రేమ పక్షులు దంపతులుగా ఒక్కటవ్వాలని అనుకొంటున్నారు. కుదిరితే ఏప్రిల్, మే నెలల్లో వివాహం జరిగేందుకు అవకాశం ఉంది.


రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఇలా.


రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే. ఇటీవల రన్ అవే 34, టూ ఫాదర్ విత్ లవ్, సర్దార్ కా గ్రాండ్ సన్, సినిమాలతో ముందుకొచ్చారు. తాజాగా చత్రీవాలీ సినిమాలో మంచి ఫెర్మార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం ఇండియన్ 2, ఆయలాన్, మేరే హస్పండ్‌ కీ బీవీ అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *