Balagam Director: తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన బలగం వేణు

| | 0 Comments| 5:32 pm
Categories:

బలగం సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ సినిమాల మధ్యన వచ్చిన స్వచ్ఛమైన పల్లెటూరి దృశ్యకావ్యం ఈ సినిమా. మన కుటుంబాల్లో కనిపించే భావోద్వేగాలనే ఇందులో కథావస్తువుగా తీసుకున్నాడు దర్శకుడు వేణు. అందుకే ప్రేక్షకులు సినిమాకు పట్టం కట్టారు. ఓటీటీలో విడుదలైనా సరే థియేటర్లకు వెళ్లే బలగం సినిమా చూస్తున్నారు.

తెలంగాణలోని పలు గ్రామాల్లో తెరలు కట్టి ఈ సినిమా చూస్తున్నారు. బలగం సినిమా చూసి విడిపోయిన అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు, తోబుట్టువులు కలుస్తున్నారంటే సినిమా ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మున్ముందు బలగంలాంటి సినిమాలు రావాలని ప్రజలతా ముక్తకంఠంతో కోరుతున్నారు. తమ ఇళ్లల్లో జరిగే వాస్తవాలను సమాజానికి తెలియజేసిన డైరెక్టర్ వేణుపై ప్రశంసలు గుప్తిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి అప్పుడే అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల దర్శకుడు వేణు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను తదుపరి తీయబోయే సినిమాలకు మరింత బాధ్యత తీసుకుంటానని చెబుతున్నాడు. తన నెక్ట్స్ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్లోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. మళ్లీ ఇలాంటి ఫ్యూర్ కథతోనే వస్తానని చెబుతున్నాడు.

బలగంలోని ఎమోషన్స్‌ ప్రేక్షకులను కదిలిస్తాయని ముందే నమ్మానని.. అదే ఇప్పుడు నిజమైందని చెప్పాడు. చాలామంది 30, 40 ఏళ్ల తర్వాత బలగం సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తున్నారని వేణు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *