సినీ పరిశ్రమలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నది అంచనా వేయడం చాలా కష్టం. అసాధ్యం అనుకున్నది వెంటనే జరిగిపోవచ్చు. కచ్చితంగా జరుగుతుంది అనుకున్నది … జరగకపోవచ్చు. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ హెడ్డింగ్ చూసి.. మీరు అనుకున్న టాపిక్ కే వెళ్ళిపోదాం. కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ దశలో ఆగిపోయినవి ఉన్నాయి. ఇంకొన్ని షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ కు ఇబ్బంది పెద్దవి ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు షూటింగ్ మధ్యంలోనే ఆగిపోయినవి ఉన్నాయి. ఆ మూడో రకం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అవును షూటింగ్ దశలో ఉండగానే కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆగిపోయాయి. పూజా కార్యక్రమాలు ముగిసాక.. ముహూర్తం సన్నివేశం కంప్లీట్ అయ్యాక ఆగిపోయిన సినిమాల లిస్ట్ ను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
సీనయ్య
.వి.వినాయక్ హీరోగా ‘శరభ’ దర్శకుడు ఎన్.నరసింహ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
2) కోతికొమ్మచ్చి :
శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు ఇక ఉండదు అని తేలిపోయింది.
3) హీరో :
విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ ఎందుకో ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
4) జేజీఎం :
లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మొదలైన సినిమా ఇది. పూరి డ్రీం ప్రాజెక్టు కూడా. అయితే ఈ చిత్రం షూటింగ్ అలా మొదలైందో లేదో వెంటనే ఆగిపోయింది.
5) ఆట నాదే వేటా నాదే :
తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా మొదలైన ఈ మూవీ.. షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
6) రామ్ – ప్రవీణ్ సత్తార్ :
క్రేజీ కాంబినేషన్లో కూడా సినిమా మొదలైంది. కానీ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే ప్రాజెక్ట్ ఆగిపోయింది.
7) డి అండ్ డి – డబుల్ డోస్ :
శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా మొదలైన ఈ మూవీ .. షూటింగ్ ఆరంభంలోనే ఆగిపోయింది. అటు హీరోని కానీ ఇటు దర్శకుడిని కానీ ఈ ప్రాజెక్టు గురించి అడిగితే సింపుల్ గా మాట దాటేస్తున్నారు.
8) నితిన్ – కృష్ణ చైతన్య ప్రాజెక్ట్ :
ఛల్ మోహన్ రంగ’ తర్వాత వీరి కాంబినేషన్లో మరో మూవీ రావాల్సి ఉంది. అనౌన్స్ చేయడమే ఆ ప్రాజెక్టుని తమ సొంత బ్యానర్ పై నిర్మించబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా సైలెంట్ గా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ బడ్జెట్ ఎక్కువైపోతోంది అనే డౌట్ వచ్చి.. ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశాడు నితిన్.
9) విశ్వక్ సేన్ – అర్జున్ :
కాంబినేషన్లో మూవీ మొదలైంది. పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా మొదలయ్యాయి. ముహూర్తపు సన్నివేశం తర్వాత షూటింగ్ మొదలవ్వడం కొన్ని సీన్స్ తీసినా అవి విశ్వక్ సేన్ కు నచ్చకపోవడం. తర్వాత అర్జున్ కి కోపం వచ్చి విశ్వక్ సేన్ ను తీసేయడం జరిగింది. అర్జున్ కు ఇంకా హీరో దొరకలేదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసే పనిలో అర్జున్ ఉన్నట్టు సమాచారం.
అడివి శేష్ హీరోగా శివాని రాజశేఖర్ మొదటి సినిమాగా ఈ మూవీ షూటింగ్ మొదలైంది. వెంకట్ రెడ్డి దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
మనోజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా మొదలైన ఈ చిత్రం షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది.
10) సూర్య – బాల మూవీ :
ఈ క్రేజీ కాంబినేషన్లో కూడా మూవీ మొదలైంది. షూటింగ్ జరుపుకుంటున్న టైంలో సడన్ గా ఈ ప్రాజెక్టు నుండి సూర్య తప్పుకున్నాడు. ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టే అని ఇన్సైడ్ టాక్.