
UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్‌పై ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్‌పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కు చేసే యూపీఐ పేమెంట్స్‌కు ఈ ఛార్జీలు ఉండవని, సాధారణ కస్టమర్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) క్లారిటీ ఇచ్చింది.
