కరోనాకు మరొకరు : వందల్లో పుట్టుకొచ్చిన కొత్త కేసులు- రాష్ట్ర సరిహద్దుల మూసివేతపై ?

| | 0 Comments| 11:34 pm
Categories:

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తోన్నట్టే కనిపిస్తోంది. కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి.
మరణాలు సైతం నమోదవుతున్నాయి.

ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. కోవిడ్ స్థితిగతులపై ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతోన్న రాష్ట్రాలకు స్టాండర్ట్ ప్రొటోకాల్స్ ను జారీ చేయనున్నారు.కోవిడ్ మరణాల్లో ప్రపంచ దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది.

నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. 5.30 వేల మంది మృతి చెందారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది.

పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.

ఇప్పుడు మళ్లీ దీని తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవ్వాళ కొత్తగా 334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు కూడా.

ఈ మధ్యకాలంలో ఎప్పుడే గానీ ఒక్కరోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు రికార్డు కాలేదు.

మరణాలు కూడా నమోదు కాలేదు. ఇవ్వాళ మాత్రం దాని తీవ్రత అనూహ్యంగా పెరిగింది. కేసులు భారీగా పెరిగాయి. ఒకరు మరణించడం కలకలం రేపుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,648కి చేరిందిఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కోవిడ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా కనిపించిన జిల్లాల్లో ఆంక్షలను విధించే అవకాశాలు ఉన్నాయి.

ఆయా జిల్లాలకు సమీపంలో ఉన్న రాష్ట్ర సరిహద్దుల వద్ద గల చెక్ పోస్టులను బలోపేతం చేయొచ్చని తెలుస్తోంది. కేసుల్లో పెరుగుదల ఇదే తరహాలో కొనసాగితే మాత్రం సరిహద్దులను మూసివేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *