జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు కాబోతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కరు ఇద్దరు టీం లీడర్ల యొక్క రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది తప్పితే ఇతర టీం లీడర్స్, కొత్తగా వచ్చే టీం లీడర్స్ యొక్క రెమ్యూనరేషన్ చాలా నార్మల్ గానే ఉంటుంది.
ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న టీం లీడర్స్ గా రాం ప్రసాద్ మరియు గెటప్ శ్రీను ఉన్నారు. ఏకంగా లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్ వారికి ఒక్క స్కిట్ కి అందుతున్నట్లుగా తెలుస్తోంది.
అంతే కాకుండా అదనంగా కూడా వారికి సహకారం ఉంటుందట. ఇక ఆ తర్వాత స్థానంలో రాకెట్ రాఘవ టీం ఉంటుందని
సమాచారం. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాకెట్ రాఘవ ఒక్క స్కిట్ కోసం లక్ష తీసుకుంటున్నాడట. ఆయన సీనియారిటీకి ఆ పారితోషకం తక్కువే అయినా కూడా జబర్దస్త్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు కనుక ఆ రెమ్యూనరేషన్ కి చేస్తూ వస్తున్నాడు అంటారు.
జబర్దస్త్ తో రెమ్యూనరేషన్ భారీగా వస్తుందని కాకుండా మంచి పేరు వస్తుందని చాలా మంది టీం లీడర్స్ కొనసాగుతున్నారు. టీమ్ లీడర్స్ మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ కూడా కేవలం పేరు కోసమే జబర్దస్త్ లో కనిపిస్తున్నారు.
జబర్దస్త్ లో కనిపించి ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిన స్టార్ట్స్ చాలా మంది ఉన్నారు. అందుకే జబర్దస్త్ లో మొదట కనిపించాలని చాలా మంది ఉబలాట పడుతున్నారు.
జబర్దస్త్ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో మంది కమెడియన్స్ దొరికారు. ఇప్పటికీ కూడా జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న కమెడియన్స్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు, కనుక వారు పారితోషికం విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇతర టీం లీడర్లకు లక్ష లోపే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.