హీరో సుధీర్ బాబు న్యూ లుక్ 6 ప్యాక్ నుండి లడ్డుబాబులా

| | 0 Comments| 10:53 am
Categories:

హీరో అంటే అందం, అభినయంతో పాటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యం బిగులు అని సిక్స్ ప్యాక్ లు మెయింటెయిన్ చేస్తుంటారు. సిక్స్ ప్యాక్ లు కాకపోయినా బాడీలు మాత్రం ఫిట్ గా ఉంచుకుంటారు. 40 ఏళ్ళు దాటినా, 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అదే ఫిట్ నెస్ ని మెయింటెయిన్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తుంటారు.

అయితే అన్ని సినిమా కథలకు ఈ శరీరం వర్కవుట్ అవ్వదు. కొన్ని కథలకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవాల్సి వస్తుంది. కథ కోసం అనేక మంది హీరోలు తమ శరీరాకృతిని మార్చుకున్నారు. కథ డిమాండ్ చేయాలే గానీ అవసరమైతే స్లిమ్ అవుతారు. మరీ అవసరం అనుకుంటే భారీగా బాడీ పెంచేస్తారు.

తమిళంలో ఇష్టమొచ్చినట్టు శరీరాన్ని మార్చుకునే నటుల్లో ముందు వరుసలో విక్రమ్ ఉంటారు. తెలుగులో కూడా ప్రభాస్, అనుష్క లాంటి వారు సినిమాల కోసం శరీరాన్ని భారీగా పెంచుకున్నారు. సైజ్ జీరో కోసం అనుష్క భారీగా పెరగ్గా. ప్రభాస్ బాహుబలి కోసం తన కటౌట్ ని భారీగా పెంచారు. అయితే ఊబకాయం ఉన్న వ్యక్తిలా కనిపించాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. తాజాగా సుధీర్ బాబు భారీ కాయంతో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం సుధీర్ బాబు మామ మశ్చీంద్ర అనే సినిమాలో నటిస్తున్నారు.ఇందులో లడ్డుబాబు సినిమాలో నరేష్ లా ఊబకాయంతో కనిపిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చెక్ లో భాగంగా క్లిప్ ని చెక్ చేస్తున్నారు.

ఆ క్లిప్ బయటకు వచ్చింది. ఇందులో సుధీర్ బాబు మొఖం ఉబ్బినట్టు. ఊబకాయం వచ్చినట్టు కనబడుతున్నారు. లడ్డుబాబు సినిమాలో నరేష్ ఊబకాయం ఉన్న వ్యక్తిలా కనబడతారు.

తాజాగా సుధీర్ బాబుని కూడా అలా మేకప్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పూర్తిగా ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపిస్తారా? లేక ఒకటి, రెండు సీన్లకే పరిమితం అవుతారా? అనేది తెలియాల్సి ఉంది.అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *