మిర్చి మూవీలో డార్లింగే పాటలో హీరోయిన్ అనుష్క ప‌క్క‌న స్టెప్పులు వేసిన ఈ సైడ్ డ్యాన్స‌ర్ ఎవరో

Categories:

సినిమా పరిశ్రమలో రాణించాలి అంటే టాలెంట్ తో పాటూగా అదృష్టం, బ్యాగ్రౌండ్ ఉండాలి అంటారు. ఇక బ్యాగ్రౌండ్ ఉన్నా కొన్నిసార్లు అదృష్టం లేకుంటే టాలెంట్ ఉన్నాకూడా అవకాశాలు అంతా తేలికగా రావు.క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. సినిమాల‌ పై ఉన్న ప్రేమ‌తో చాలా మంది ఏ క్యారక్టర్స్ వ‌చ్చినా చేస్తుంటారు.

సినీరంగంలో రాణించ‌డానికి చాలా క‌ష్టాల్ని అనుభ‌విస్తారు.ఇలానే ఎటువంటి సినీ నేపద్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి కెరీర్ తొలి రోజుల్లో సైడ్ డ్యాన‌ర్స్ గా చేసి, ప్ర‌స్తుతం యాంక‌ర్ గాను, న‌టిగా రాణిస్తోంది భాను శ్రీ. ఈమె బ్యూటీ తన కెరీర్ ను సైడ్ డ్యాన్స‌ర్ గా మొదలుపెట్టింది.

ప్రభాస్ అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన మిర్చి మూవీలో వేసిన డార్లింగే ఓసినా డార్లింగే సాంగ్ లో సైడ్ డ్యాన్స‌ర్ గా భాను శ్రీ స్టెప్పులు వేస్తూ అనుష్క పక్కన క‌నిపించింది.
అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ మూవీ త‌ర‌వాత కూడా చాలా చిత్రాలలో సైడ్ డ్యాన్స‌ర్ గా చేసింది. సినిమాలలో నే కాకుండా భాను శ్రీ సీరియ‌ల్స్ లో కూడా న‌టించింది. ఆ తరువాత పటాస్ అనే షోతో బుల్లితెర యాంకర్ గా మారింది.

ఆ షోతో పాపులర్ అయ్యింది. ఆ తరువాత భాను శ్రీకి యాంకర్ గా అవకాశాలు రావడంతో యాంకర్ గా సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్స్ రావడంతో బిగ్ బాస్ లోకి షోలో పాల్గొని త‌న ముక్కుసూటి తనంతో చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ నుండి వచ్చిన త‌ర‌వాత చాలా సినిమాలలో అవకాశాలను పొందింది. భాను శ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పడికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

ఇక భాను శ్రీ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి. ప్ర‌స్తుతం భాను శ్రీ ఒకవైపు యాంక‌ర్ గా కొన‌సాగుతూనే,మరో వైపు న‌టిగా సినిమాలు కూడా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *