సురేఖా వాణి కూతురు గ్లామ‌ర్‌ షో దారుణంగా తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Categories:

సురేష్ తేజ – సురేఖ వాణి కూతురిగా సుప్రిత ప్రపంచానికి పరిచయం కాగా, యూట్యూబర్‌గా ఈ చిన్నది యమ పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది.

ఈ అమ్మడు 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసింది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచేసుకుంది.

చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సుప్రితను తల్లి సురేఖ వాణి సినీ రంగానికి పరిచయం
చేయాల‌ని ఎంత‌గానో ఉవిళ్లూరుతుంది.
సుప్రిత గురించి అప్పుడప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తల్లితో కలిసి సుప్రిత తరచూ రెచ్చిపోతోంది.

దీంతో హాట్ టాపిక్ అవుతోంది. సుప్రిత త‌న‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను వ‌దులుతూ తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా తల్లి కూతుళ్లు ఇద్దరూ హ్యాపీగా బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా సురేఖ వాణి తన కుమార్తెతో బీచ్ లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇందులో సుప్రీత కాస్త బోల్డ్ గా అందాలు ఆరబోస్తోంది.

కూతురిని ఎందుకు ఇలా చెడ‌గొడుతున్నావు.. మీ లగ్జరీ మైంటనెన్స్ కి డబ్బు ఎలా వస్తోంది, అమ్మని మించిపోయిన కూతురు అయిందిగా అంటూ సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *