తారకరత్న రహస్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అప్పటికే వివాహామైన అలేఖ్య రెడ్డిని వివాహాం చేసుకున్నారనేది చాలా కొద్ది మందికే తెలుసు.
దాంతో తారకరత్న నందమూరి ఫ్యామిలీ కొద్దికాలం పాటు దూరం కావాల్సి వచ్చింది.
టాలీవుడ్ దిగ్గజ నటుడు నందమూరి తారక రామరావు మనవడిగా నందమూరి తారకరత్న తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. నందమూరి ఫ్యామిలీలో ప్రత్యేక స్థానం ఉన్న తారకరత్న ఐదేండ్లు వారికి దూరం కావాల్సి వచ్చిందనేది ప్రచారం.
తారకరత్న 2012లో అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది రహస్య పెళ్లి. అయితే, అప్పటికే అలేఖ్యరెడ్డి దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఇంటి కోడలు. మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డితో మొదట పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోయారు.
ఫలితంగా అప్పటి వరకు నందమూరి ఫ్యామిలీలో మంచి గౌరవం ఉన్న తారకరత్న వారికి కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఏకంగా ఐదేండ్ల పాటు దూరమైనట్టు ప్రచారం. కొన్నాళ్ల కిందనే మళ్లీ అంతా సర్దుకుంటోంది.
తారకరత్న – అలేఖ్యకు ఒక కూతురు కూడా ఉంది. కూతురును చూసుకుంటూ ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఇక ఇటీవల రాజకీయాల్లోనూ యాక్టివ్ అవుతూ వచ్చారు. అటు వెండితెరపైనా హీరోగానే కాకుండానే విలన్ గానూ అలరించేందుకు సిద్ధమయ్యారు.
2002లో వచ్చిన ‘ఒకటో నంబర్ కుర్రాడు’తో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 20కిపైగా సినిమాలతో అలరించారు. చివరిగా s5 no exit చిత్రంలో నెగెటివ్ రోల్ నూ నటించి ఆకట్టుకున్నారు.