తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రతీ ఒక్కరూ ఈ ప్రసాదం తీసుకోవాల్సిందే.

Categories:

307 ఏళ్లు చరిత్ర ఉన్న ఈ తిరుమల ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు.
తిరుమల లడ్డూకు వచ్చే రుచి మరెక్కడా లభించదు. తిరుమల లడ్డూ అన్ని రకాలుగా ప్రత్యేకమైనదే. దశాబ్దాల కాలంగా ఒకే రుచితో ఎక్కడా రాజీ పడకుండా ఈ లడ్డూ తయారీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ పెరుగుతున్నా.
లడ్డూ ప్రసాదాలు అందించటంలోనూ టీటీపీ తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో..అనూహ్యంగా పెరుగుతున్న భక్తుల రద్దీరద్దీ.లడ్డూ ప్రసాదం డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
లడ్డూల తయారీకి ఆధునిక యంత్రాలుపెరుగుతున్న తిరుమల లడ్డూ ప్రసాదం కోసం టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. తిరుమలలో లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో కొత్త వ్యవస్థ ప్రారంభిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే బూందీ తయారీకి స్టవ్‌ల అవసరం ఉండదన్నారు.
రోజుకు 6లక్షల వరకు లడ్డూలు తయారుచేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ యంత్రాలను స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన అన్ని పదార్ధాలు వేస్తే ఆ యంత్రమే లడ్డూ తయారీ చేస్తుందని ఈవో వివరించారు.
దీని ద్వారా పెరుగుతున్న భక్తులకు తగినంత స్థాయిలో లడ్డూలు వేగంగా సిద్దం చేయటానికి అవకాశం ఏర్పుడుతందన్నారు. నాణ్యత విషయంలో ఏ మాత్రం తేడా ఉండదని చెప్పుకొచ్చారు.
రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ఆనందనిలయం బంగారు తాపడం పనులపైై
ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలను టీటీడీ ఈవో వెల్లడించారు. తిరుమలలో వెంగమాంబ అన్నప్రసాద భవనం ముందు నిర్మించిన నూతన పరకామణి భవనంలో 5వ తేదీ నుంచి హుండీ కానుకల లెక్కింపులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
నాణేల వర్గీకరణ, ప్యాకింగ్ కోసం 15 రోజుల్లో రూ.4.50 కోట్లతో జర్మనీ నుంచి ప్రత్యేక యంత్రాలను తీసుకొస్తున్నట్లు వివరించారు. తెలిపారు. ఈ యంత్రాలు నాణేలను వేరు చేసి లెక్కించడంతో పాటు ప్యాకెట్లుగా మారుస్తాయని వెల్లడించారు. నూతన భవనంలో లెక్కింపులు సవ్యంగా జరిగిన తర్వాత ఆలయంలోని పరకామణిని తొలగిస్తామన్నారు. ఆనందనిలయం బంగారు తాపడం పనులు ఆరు నెలల పాటు వాయిదా వేశామని ఈవో పేర్కొన్నారు.
స్వర్ణ తాపడం పనులకు గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు. నిర్ధేశించిన సమయంలో బంగారు తాపడం పనులను పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని.. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో పనులను వాయిదా వేశామన్నారు.

తిరుమల యాప్ ద్వారా డిజిటల్ సేవలు
తిరుమల భక్తులకు డిజిటల్ సేవలను అందించేందుకు చర్యలు ప్రారంభించామని ఈవో చెప్పారు. ఇప్పటికే తీసుకొచ్చిన TTDevasthanams యాప్ కు మంచి స్పందన కనిపిస్తోందన్నారు. ఈ యాప్ ద్వారా తిరుమలలో దర్శనం వసతి శ్రీవారి సేవల గురించి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమాచారం తెలుసుకొనే అవకాశం కలిగిందన్నారు. అదే విధంగా అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవడంతో పాటు విరాళాలు కూడా అందించవచ్చని చెప్పారు.
పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకొనే వెసులుబాటు ఉందని వివరించారు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *