ఆ విషయానికి ఓపెన్ గా చెప్పేసిన రష్మిక..ఫ్యాన్స్ హ్యాపీ..!

Categories:

క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే .

సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా సరే ..క్షణం తీరిక దొరికిన అభిమానులతో టైం స్పెండ్ చేయడానికి లైక్ చేసే రష్మిక మందన ..రీసెంట్గా తన అభిమానులు ఎప్పటినుంచో అడుగుతున్న ప్రశ్నకు జవాబు ఇచ్చేసింది .

తన చేతి పై రాసి ఉన్న టాటూ కి ఆమె వేయించుకుంది అన్న దానికి క్లారిటీ ఇస్తూ సంచలన కామెంట్స్ చేసింది .

మనకు తెలిసిందే రష్మిక మందన రీసెంట్గా నటించిన సినిమా వారీసు . తెలుగులో వారసుడు అనే పేరుతో రిలీజ్ అయింది . కాగా ఈ సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది .

ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన చేతిపై రాసి ఉన్న టాటూ కి ఉన్న స్టోరీను జనాలకు చెప్పుకొచ్చింది. “తాను కాలేజీ చదివే టైం లో ఓ అబ్బాయి తన వద్దకు వచ్చి అమ్మాయిలు సూదులతో గుచ్చితే తట్టుకోలేరని అమ్మాయిలు ఆ నొప్పిని తీసుకోలేరని హేళనగా మాట్లాడారు”.

“అదే టైంలో అమ్మాయిలు ఏదైనా చేయగలరు అని నిరూపించడానికి నేను టాటూ వేయించుకోవాలని డిసైడ్ అయ్యాను . అయితే ఏం టాటూ వేయించుకోవాలో నాకు అర్థం కాలేదు. చాలా టైం ఆలోచించాను అప్పుడే నాకు అర్థమైంది మనల్ని మన స్దానాని ఎవరు రీప్లేస్ చేయలేరు .

ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది . ఆ మనిషిలోని టాలెంట్ ని వేరే వ్యక్తులు మార్చలేరు . ఆ కారణంగానే ఆ టాటూ వేసుకున్నాను “అంటూ క్లారిటీఇచ్చింది. దీనితో రష్మిక మందన్న టాటూ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా గత కొత కాలంగా రష్మిక-విజయ్ ల మధ్య లవ్ నడుస్తుంది అని అంత అనుకుంటున్నారు. అ అవిషయం పై మాత్రం రష్మిక ఇప్పటి వరకు ఆన్సర్ ఇవ్వలేదు..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *