తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ టీవీలకి అతుక్కుపోయి ఈ సినిమాను చూస్తూ ఉంటారు
ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించినప్పటికీ సదా హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమాలో మాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. విలన్ గా ఈ సినిమాతో మంచి గుర్తింపును పొందాడు గోపీచంద్.
ఇక 2002లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇక మొదటి సినిమాతోనే ఈ సినిమాలో హీరో హీరోయిన్గా నటించిన నితిన్ మరియు సదా కి మంచి పేరు కూడా వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 20 ఏళ్లు అవుతున్నప్పటికీ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.
అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు ఎంత ఆకట్టుకున్నాయో సదా చెల్లెలిగా ఈ సినిమాలో కనిపించిన ఒక చిన్న అమ్మాయి కూడా తన నటనతో చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఇక ఈ సినిమాలో సదా చెల్లెలుగా అక్షరాలను తిప్పి రాసే అమ్మాయిగా అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిన్నారి ఒక్క సినిమాతోనే ఏకంగా నంది అవార్డున సైతం గెలుచుకుంది.
అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఆ అమ్మాయి ఎవరు.
అసలు ఏం చేస్తుంది.. అని ఆరాధిస్తున్నారు చాలామంది విశ్లేషకులు.
అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ చిన్నారి పేరు యామిని శ్వేత.
ఇక ఈ చిన్నారి సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురు. చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ పెద్దయ్యాక సినిమాలలో నటించడం లేదు ఈమె.
జయం సినిమా అనంతరం ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాలలో నటించింది.
ఇక ఈ సినిమాలతో ఇండస్ట్రీకి దూరమైంది విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసిన ఈమె..ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఈమెకి ఒక పాప కూడా ఉంది.
చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా పెద్దయ్యాక కూడా యామినికి చాలా ఆఫర్లు రావడం జరిగింది
కానీ చదువు పూర్తి చేసేందుకు సినిమాలకు దూరమైంది యామిని.